యుద్దంలో ? ఆరితేరిన బుద్దుడు:-పోలయ్య కవి కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్...9110784502
కొరడాలతో కొట్టినా కత్తులతో పొడిచినా
పరుషంగా తిట్టినా శ్రమలెన్ని పెట్టినా
చలించక సహిస్తూ ఎవరినినీ నిందించక 
చిరునవ్వులు చిందిస్తూ
ఘాటైన ఒక్కమాటైనా అనకపోగా
సమాజంకోసం ప్రాణత్యాగానికైనా సంసిద్ధం

ఆ సహనశీలిలో లేనికది
ఆ శాంతమూర్తిలో కాగడాపెట్టి వెతికినా
కానరానిది ఒక్కటే...కోపం
ఆ కోపమే అయ్యోపాపమనే ఆ తత్వమే
ఆ త్యాగమూర్తి...ఆ ప్రేమమూర్తి
భోగానికి రాజయోగానికి...ఒక శాపం
ఆ మహాజ్ఞాని అందించిన ఆ అమృత 
సందేశమే‌ అఖిలజగత్తుకు...ఒక ఆరనిదీపం

ప్రపంచమంతా పర్యటించి ప్రజలందరికి
అహింసా పాఠాలను నేర్పించిన
"అమృతమూర్తి" "అహింసా చక్రవర్తి"
నాటి వర్ణవ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించిన
వైదికమతాన్ని నిరసించిన నిప్పులు కురిపించిన
సనాతనధర్మం సంస్కృతి సంప్రదాయాలపై 
విరుచుకుపడిన సవాలు విసిరిన 
తిరుగుబాటు చేసిన "ఆథ్యాత్మిక గురువు"

అంటరానితనంపై ఒంటరిగా చిత్తశుద్ధితో
పోరుసల్పిన "సింహబలుడు"
నాడు భక్తపోతనచే ఆ శ్రీరామచంద్రుడు
భాగవతం వ్రాయించినట్లుగా
నేడు సమానత్వం సౌభ్రాతృత్వం
స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను
"త్రిసూత్రాలే తన త్రినేత్రాలుగా"
బడుగుజీవుల ఆశాజ్యోతియైన 
అమరజీవి అంబేద్కర్ చే
భారతరాజ్యాంగం రాయించిన
"అంబేద్కర్ ఆత్మబంధువే" గౌతమబుద్ధుడు

తన విలువైన విజ్ఞానదాయకమైన 
అమృతమయబోధనలతో తరతరాలుగా
అస్పృశ్యతకు అణచివేతలకు గురైన 
అమాయకపు శ్రమజీవుల్లో నరనరాన
నవచైతన్యాన్ని ఇంజక్ట్ చేసిన"నరనారాయణుడు"
ఆసియా ఖండానికే "వెలుగుగా"
అనంత విశ్వానికే "అఖండజ్యోతిగా"
కీర్తింపబడుతూ...అహింసా...శాంతి
యుద్దంలో...ఆరితేరిన ఆ బుద్దభగవానుడి
జయంతి సందర్భంగా ఇదే నా "అక్షరసుమాంజలి"

(నేడు గౌతమ బుద్ద జయంతి సందర్భంగా)