భార్య భర్తల జీవన శైలీలు. :-కైతికాలు:- డా గాజులనరసింహ-నాగటూరుకర్నూలు జిల్లా-9177071129
భార్యా భర్తలంటే
శాశ్వత భాగస్వాములు
ఒకరికి ఒకరై ఉండే
విడదీయని నేస్తాలు 
ఈ చారాచరాలలో 
చూడ చక్కని జీవులు. 

ఇద్దరి మనసులు కలిసి
ఇద్దరి చూపులు కలిసి
మనువాడుదురు ఇద్దరు
ఒకరిని ఒకరు తెలిసి
కళ్యాణ వేదికపై
ఆడమగలు ఇద్దరు. 

పందిళ్లు సందళ్ళు
తప్పట్లు తాళాలు 
మూడుముళ్లు తలంబ్రాలు
వేసే ఏడడుగులు
వారెవ్వా !పచ్చిని వేదికపై చక్కని జంట
భార్య భర్తలు అయ్యి.. 


సప్తపదుల సంగమం
చూపులతో ఆరంభము
మాటా మంతులతో  
జరుగు పెళ్లి  శుభము
పెళ్లి మానవుని జీవితంలో
ఓ మహత్తరమైనా  ఘట్టం.

ముడిపడి మూడుముళ్ళతో
కలివడి  తనువులతో
త్వరబడి సాగెదరు
ఏడు అడుగులతో
తాము కన్నా కలలా
తీరాలవె0టా...

ఒకరికి ఒకరిష్టంగ   ఒ
కరిపై ఒకరు ప్రేమగ
ముద్దు ముచ్చట్లతో
ఇద్దరూ.....మురిసేరుగా 
పెళ్ళైనా... కొత్తలో....
కోరిక తీరుగా ....

ఆశల పల్లకిలో
కోరికల కొలనులో
కళకళ లాడునులే 
కోటికాంతులలో
యవ్వనజంట  కలువలవలే
నవనీయతముగా.. 

సంసారానికి ఇద్దరు
సాయుధులు ఆలమగలు
బండికి చక్రాలు
ఇద్దరు ఆలమగలు
భార్యాభర్తలంటే సంసారాంలో
సమతూలతా  గలవారు. 

దాంపత్యజీవితం ఉం
డాలి   అన్యోన్యంగా
నూరేళ్ళ బతుకులో
ఎంతో అనురాగంగా
మెలగాలి ఈ జగతిలో
ఎంతో అపురూపంగా.. 

పచ్చపచ్చనిచిలలై
చక్కని సంసారంలో
మెలగాలి ఇద్దరు  ఈ 
జనజీవనములో
కావాలి ఇద్దరు ముందు
తరాలకు ఆదర్శము  

ఆటుపోటులు సహజం
అన్నట్టు కడలిలో
కోపాలు తాపాలు
సహజం  సంసారంలో
అన్నింటిని ఓర్చి ఒదిగితేనే
ఆలుమగలా దాంపత్యం  

సంశయంతో సాగితే
తడబడదా సంసారం
ఎడమోము పెడమోములుం
టె  చెడిపోద సంసారం
వారెవ్వా !ఆక్షణంలో చొరవ చేసు
కోదా.. ఎడబాటుతనం  

అపార్ధాలకు తావు
ఉండరాదు ఎపుడు
కలనైనా దూరాలు
రానివ్వరాదు ఎప్పుడు
కలగలిసి మెలగాలి
తెలిసి ఒకరికొకరు.  

సంసారానికి చక్కని
జంటలే నిదర్శనాలు
కాపురానికి  మంచి
జంటలె  ఆదర్శకాలు
వారెవ్వా !సంసారమన్నది ఒక
సాయుధపోరాటమే కదా  

తప్పులు ఒప్పులు ఇద్దరు
సరిదిద్దుకోవాలి
కష్ట సుఖాలు ఇద్దరు
పాలుపంచుకోవాలు
మహోన్నతులై ఇద్దరు
జగతిలో నిలవాలి. 

కడగళ్లలోన ఇద్దరు
కలగలిసి సాగాలి
వడగళ్లలోన ఇద్దరు
ఏకమై ఉండాలి
ఈ మానవ ప్రపంచానికి
ఓ అర్థం చెప్పాలి. 

నిత్యం పరిమళించాలి
విరబూసే పూలలా
సత్యమెపుడు పలకాలి
గుడిలొ మోగే గంటలా
అప్పుడే ఉండదు ఎట్టి అప
శృతులకు  తావు ఇద్దరిలో ..