పాట ,:--డా, గాజులనరసింహ-నాగటూరు గ్రామం -కర్నూలు జిల్లా-9177071129

 పల్లవి:-
చుక్కలోలే సక్కనోళ్లు మనుషులురా..
పువ్వులోలే మెత్తవి తమ మనసులురా.. ఓ నాయనా..2
దిక్కుదిక్కూనవున్నా దివిటోలే వెలిగేరురా .. మనుషులుఅంటే..ఓ నాయనా..2""పల్లవి""

చరణం:- 1
ఈ అందమైన లోకాన అవతరించి ఓ నాయనా
మహాజ్ఞానులై వారు ఎంతో ఎత్తుకు ఎదిగినారురా..ఓ నాయనా ఓ నాయనా..
మనుషులంటే  మంచోళ్ళురా..మనసున్న మారాజులురా..
ఆ అన్నమాటకే అర్థాలు నేడు వేరాయరా..
అట్టి మనుషులే నేడు కారువాయరా..ఓ నాయనా..
ఏంచేతు లోకం ఎట్టాయరా.. 2
చరణం:-2
మాటలు నెర్చీన జీవులురా..మనుషులుఅంటే ఓ నాయనా..
- మట్టిలోని మాణిక్యాలురా ..ఓ నాయనా 
కమలపువ్వులాంటోళ్లురా మనుషులు అంటే ఏ కల్మషం లేనోళ్ళురా..ఓ నాయనా
దరిదాపుల్లా వుండేటి దేవుళ్ళురా దయవున్నదాతలురా.ఓ నాయనా..2
ఆ అన్నమాటకే నేడు అర్థాలు వేరాయరా..ఓ నాయనా అర్థాలే వేరాయరా..
మృగాన్ని మించారు అనురాగం మరిచారురా.
రాబంధులై రాజ్యామేలేరురా.ఓ నాయనా వారు .2""పల్లవి""
చరణం:- 3
చమటోర్చేటి  శ్రమజీవులురా...మనుషులు అంటే..
కలగలిసేటి కాకులురా ..మనుషులు
అంటే..ఓ నాయనా..మనుషులు అంటే...
చెలిమిగా వుండేరు ముడిపడి జగాన మనుషులు అంటే..ఓ నాయనా.
పాడి పంటంటి రూపాలురా..ఓ నాయనా మనుషులఅంటే ...2
ఆ అన్నమాటకే  అర్థాలు నేడు  వేరాయరా.. ఓ నాయనా
సాటి మనిషంటే మనిషీకి నేడు చేదాయరా.. ఓ నాయనా 2
""పల్లవి""