ఓ మనిషి ఇంకా ఉన్నావా...? మణిపూసలు:- :-గాజులనరసింహ-నాగటూరు-9177071129
.ఓ ..మనిషి నీవు ఎవరూ..?
అరె నీ కన్నోళ్ళు ఎవరు
ఈ నవయుగ ప్రపంచం
లొ  నిను  గుర్తించేదెవరు   

మబ్బుల ముసుగులో ఉంది
స్వార్థపు బాటలొ పోతుంది
ఎత్తుగడప్రపంచంలొ
అరె నీస్తానమేడుంది 

వ్యూహాల ధోరణిలో
డబ్బన్న వ్యాధిలో
కలతబడుతూ కలబడు
తు సాగె లోకం ఇలలొ 

కుంటుబడిన సమాజము
కుల్లబడిన సమాజము
అవనిలో యిది వ్యాధి
సోకినా ఓ ప్రపంచము 

మనసే లేని మనుషులు
మమతే లేని మనుషులు
ఇందరి మధ్యలొ ఎక్క
డోయి నీ ఆనవాలు 

విలువలే పోయాయిగా 
మమతలే సచ్చాయిగా
మానవ మృగాలమధ్య
ఎలా ఉంటావు మనిషిగ 

మనిషి నీకు రూపముంది
మాట యిక నేర్పరి ఉంది
నూ మనిషివన్న భావన 
నీలో లేక పోయింది 

నువ్వు మనిషివి అయితేను
వెతుకుము నీలాంటోడును
ఈ సమాజంలో లేడు
చూడు ఎక్కడ ఎవ్వడును 

నిర్జీవమై రాతిలా
ఉండాలి గాని ఇలలా
మనిషివై నువ్వు మనిషీ
గా బతకలేవు  ఇలలా  

లోకం ఎంతొ మారింది
కాలం పరుగు పెంచింది
మనిషిలోని  ఆలోచన
నే అనార్థము అవుతుంది 

అంతానికి ఆరంభము
జరుగువన్నీ  సూచనలు
ఎడబాటైన తీర0లో
బతకనెవరికి  సాధ్యాలు