మేలుకు మేలు ( కథ) -డా గాజులనరసింహ-9177071129
 అనగనగా ...ఒక ఊరిలో 
నాలుగు వ్యక్తులు వుండేవారు.
వారిలో ముగ్గురు దురుసుగా ,చెడుగా మాట్లాడేవారు వున్నారు ఒక్కరు మాత్రం మంచిగా ,మాటలాడి పెద్దలను గౌరవిస్తూ ఉండేవాడు .వాళ్ళ పేర్లు యాదన్న ,సోమన్న ,ఎంకన్న, ఎల్లన్న,  వారి ఆలోచనలు మాటలు చేతలు ఒకరికి ఒకరికి సంబంధం ఉండవు .అయినా వారు స్నేతులు .వారు పేదవాళ్లే కష్టం చేసుకొని బతికేవాళ్ళు .
ఒకనాడు ఉరిలోకి సాధువు బిక్షానికి వచ్చాడు . అతనివేశము ఆకారం వింతగా వికారంగా ఉంది .తాను వీధి వీధి బిక్షమెత్తుకుంటూ ఈ నలుగురూ ఉన్న వీధిలోకి వెళ్ళాడు .కొందరు లేదు అంటారు కొందరు పోయిరాపో అంటారు కొందరు పెడతారు .
ఆ నలుగురిలో సోమన్న మంచివ్యక్తి  అతని ఇంటికి వస్తే సాధువు అతనికి మంచిగా పదార్థం పెట్టి తనకు ఉన్నంతలో .మంచిమాటలతో మర్యాదించి పంపెను మిగతా ముగ్గురు ఇతన్ని హేళన చేసిరి. సాధువు ఏమి అనుకోకుండా  తనదారి తను వెళ్లిపోయెను .
ఒక్కరోజు ఆ నలుగురు కట్టెలు వనముకు వెళ్లిరి .అక్కడ పాడుబడ్డ యిల్లు ,పొదలు పొదలు చెట్లు ఉన్నాయి . ఆ పొదలలో మంచి రేగిపండు చెట్టు ఒక్కటి ఉంది ఆ పండ్లు చాలా బాగుంటాయి .వాళ్లకు వాటిని చూడాగానే  నోట్లో నీళ్లు ఊరాయి . కానీ అక్కడే పొదలో ఒక తేనె తెట్టే ఉంది .అది గమనించిన సోమన్న వద్దు  ఇక్కడినుండి పోదాం పద0డి అన్నాడు .అయిన వాళ్ళు విపించుకోకుండా .. రాళ్లు ఆ రేగిచెట్టుకు విసిరారు. ఆ తాకిడికి తేనెటీగలు పైకి లేచాయి .సోమన్న రాండి రాండి పోదాం అన్నా... వాళ్లు వినిపించుకోలేదు అలాగే రాళ్లు రువ్వారు.రాయ్యిన ఈగలు లేచాయి వాళ్ళను కొట్టడం మొదలు పెట్టాయి ఆ నొప్పి చాల బాధగా ఉంది .
అపుడు ఎవరి దారి వారు పరుగెత్తారు అయినా వారినిB వెంబడిస్తూనే ఉన్నాయి .సోమన్న పరుగెత్తులేక కిందపడ్డాడు .ఈగకు అతన్ని కుట్టాయి ముగ్గురు పరుగెత్తుతూనే వున్నారు. కనీ సోమన్నకు దగ్గరలో సాధువు వున్నాడు .ఆ సాధువు అతన్ని చూసి ...అయ్యో ..!అంటూ తందగ్గర ఉన్న కంబలిని కప్పెను .కాసేపటికి ఉండి ఉండి వెళ్లిపోయెను.. వాళ్ళను మాత్రం బాగా కరిచాయి .
సోమన్నకు ఈగలు కరిచినచిన చోట ఆకు పసురు పూసి నొప్పి తగ్గించి పంపెను  

ఇందులో నీతి మనం మేలు చేస్తే మనకు మేలు హారుగుతుంది .