తారకరత్నం:-డా గాజులనరసింహ-నాగటూరు గ్రామం-కర్నూలు జిల్లా9177071129
 సుగుణాభి రాముడు నిమ్మకూయిరి వాసుడు
సర్వకళా పారంగతుడు నవనట  సార్వభౌముడు
కళామ తనయుడు అఖిలాంధ్ర ప్రియుడు
ధ్రువతారకుడు నందమూరి యుగపురుషుడు
అవనిలో అవతారుడు హాలికుడు ఆరడుగుల
అందగాడు అజానుభాహుడు ఆంధ్రీయుడు
అన్నదాతల వారసుడు  అందరికీ సుపరిచితుడు
తెలుగుభాష ప్రియుడు ఉన్నత భావకుడు
అసంఖ్యాకులకు ఆత్మీయుడు ఆరాద్యుడు
ప్రశంసనీయుడు అద్వితీయుడు  నందమూరి
తిరుగులేని మేటి వెనకడుగు లేని ధీటి
చలనచిత్రసీమలో  దినకరుడు పారిజాతకుడు
రాజకీయంలో రారాజు భారతదేశంలో తెలుగోళ్ల హృదయవాసుడు
నందమూరి తారకుడు  
రక్కసిమూకలకు సింహస్వప్నము 
రాబంధులకు రాజసింహము
దేశ ద్రోహులకు బొబ్బిలి సింహము
చోరులకు అపరిచితులకు కొండవీటి సింహము
మనతెలుగు నాట వెలిసిన తెలుగు తేజము
సకల తెలుగు జాతికి వెలుగు కిరణము 
వారెవ్వా...!నందమూరి నవరత్నము..