అమ్మ గోరుముద్దలు తినలే
నాన్న ప్రేమ కనుల నైన కనలే
తాత నానమ్మ ల పేర్లయినా వినలే
అయ్యో పాపం అనే మాట నే తెలియలే!?
ఓ వైపు ఆకలి బాధ మరోవైపు అభద్రతా భావం
ఎక్కడ ఉండాలో ఏమి చేయాలో ఎవరికి
చెప్పుకోవాలో……... తెలియక పాయే….
అమ్మ ఆకలి అంటే ఆలకించే వారెవరు??
ప్రేమతో పలకరించేందుకు నాన్న ఎలా ఉంటాడో తెలియని వారు ఎందరో?????
రిక్షా లాగే దగ్గర కూలి పని చేసే దగ్గర
పూలు కట్టే చోట ఇక్కడి నేనేమి…..
అన్నిటికి మించి శక్తికి మించి వెట్టిచాకిరి
అంత శ్రమ దోపిడీ... శ్రమదోపిడి..
బాల కార్మికుల దోపిడి అనాధల శ్రమదోపిడి అమాయకత్వపు దోపిడి…….!???
కంటినిండా నిద్ర లేకపపాయే..
ఒంటినిండా బట్ట లేకపాయె….
జీవితమంతా కష్టాల కడలిలో
ప్రేమ కరువు పేదరికమే ఆభరణంగా
ఎటు పోతుందో ఏమవుతుందో ఈ జీవిత గమనం
ఎందుకు బ్రతకాలో ఎందుకు బ్రతకకూడదు చెప్పేవారెవరు……?
వారి ఉంటే ఎంతమంది అనాథలవుతారా??
క్షణికావేశంలో ఎవరి మొహానికో జన్మనిచ్చి
పాపాన్ని చేతికి మట్టి అంటకుండా దులిపేసుకున్న
ఆ తల్లులు ఎవరో????
ఇప్పటికైనా ఈ సమాజాన్ని మేల్కొల్పడం
చైతన్యవంతులను చేయడం... ?
మన అందరి బాధ్యత... కాదంటారా చెప్పండి?
ఇంకా ఆ రాతలు ఆర్తనాదాలు చేసేవారు పుడుతూనే ఉంటారు వందలు వేలు???
అందుకే మనమంతా నడుంకట్టి అనాధలు లేని ఆకలి ఆర్తనాదాలు లేని బాలు గారి వయసు బాలలకు ఇద్దాం ప్రేమను భరోసాను జ్ఞానాన్ని కనీస అవసరాలను కీర్తి అందుకు మేమంతా ఉన్నామని భరోసా…
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి