*అక్షర మాల గేయాలు* *'ఓ' అక్షరం**గేయం:: ఓహో ఓహో నా పలకా ‌*:- *వురిమళ్ల సునంద, ఖమ్మం* 9221815722

 ఓహో ఓహో నా పలకా!
ఓనమాలు నేర్చుకునే నా పలక
ఓం నమశ్శివాయ మంత్రంతో
ఓంకార రూపమైన నా పలక
ఓరిమి శక్తి ఇచ్చిన నా పలకా
ఓటమిని జయించిన నా పలకా  
ఓజస్సుతో వెలిగిన నా పలకా
ఓపక చెరిపిన  రాతలను
ఓపికతో సరిదిద్దిన నా పలకా
ఓడలాంటి  నా బతుకు నావకు
ఓహో భేష్ అనే పతాక నా పలకా....