అమ్మంటే..?:-యలమర్తి అనూరాధ--హైద్రాబాద్--చరవాణి:9247250206


 తరగని ప్రేమ
వీడని బంధం
చెరగని అనుబంధం
అంతు తెలియని అనురాగం 
గెలుపు సందేశం 
నిలువెత్తు బంగారం
ఆశల ఊపిరి 
ఆప్యాయతల వెల్లువ
ఊయల ఒడి
చల్లని పందిరి
లక్ష్యపు బాట 
అరుదైన ఆలంబన 
ఆశిస్సుల మాల
అక్షింతల అండ 
ఈ జన్మకు అధికారి
(అంతర్జాతీయ మాతృ దినోత్సవం)
కామెంట్‌లు