నవ్వుల పువ్వులు:-*"రసస్రవంతి " & "కావ్యసుధ*" హయత్ నగర్, హైదరాబాద్ చరవాణి : 9247313488.

 మనిషి
ఓ నవ్వు నవ్వి తే
కొన్ని వేల నాడులు
వికసిత మవుతాయట
పసిపిల్లల బోసి నవ్వులు
మొలక నవ్వులు....
కిలకిలమని
గలగలమని
పలకరింపు నవ్వులు
చెక్కిళ్ళలో
చిగురింతగా
చిలిపి జాజి పువ్వులు
ఓపలేని దైన నవ్వు
ఆపజాల లేని నవ్వు
చూపరులను నవ్వించే
సుఖము గూర్చు నట్టి నవ్వు
అట్టహాసంగా నవ్వు
పొట్ట చెక్కలయ్యే నవ్వు
చెట్టా పట్టాలేసుక
చెంగలించు చున్న నవ్వు
నవ్వు నోచలేని బ్రతుకు
నానా అగచాట్ల పాలు
నవ్వు పూలు పూసి నోళ్ళు
నాకా లోక నివాసీలు.