పద్యాలు:-మమత ఐల-హైదరాబాద్-9247593432

 అంశం:- మాజీ ముఖ్యమంత్రి NT రామారావు

ఉ.
దండిగ పేరుగాంచెనట తారక రాముని వేశమందునన్
పండగ జాతరై జనులు పట్టము గట్టిరి రాష్ట్రమెల్లడన్
మెండుగ తేజరిల్లె జగమెల్లరు మెచ్చెడి మంత్రిగా నితన్
వెండితెరాధురెల్లరికి విశ్వసనీయపు మార్గమేనితన్
ఉ.
సైకిలు గుర్తుతో నిలిచి సవ్యముగా పరిపాలకుండయెన్
భీకర పాత్ర పోషకుడు భీముడు కర్ణుడు రావణుండుగా
శోకపు పాత్రలైన పరిశుద్ధ మొనర్చెను కీర్తిమంతుడై
లోకము మెచ్చునట్టుగనె రూపుదరించెను చిత్రసీమలో