పద్యాలు:-మమత ఐల-హైదరాబాద్-9247593432

 అంశం:-చిరుగాలి
 ఆ.వె
పచ్చ పచ్చని మన పంట చేలల్లోన
వేణుగానమల్లె వీచు చుండు
తనువు పులకరించ దవనమై చిరుగాలి
వచ్చి తగులునుగద పదిలముగను
అంశం:- దానము
ఉ.
దానము చేయునట్టిగుణ తత్వముగల్గినచాలు మాన్యులే
మానవ జాతికొంతతన మార్గము నెంచుచు జూసినేర్తురే
దానముతోడ సేవలనుదండిగ జేసెకరోననెంచి యా
భానుడు సోనొసూద్ గ నిటు బాధలు బాపగ వచ్చినట్లుగన్