పద్యాలు:-మమత ఐల-హైదరాబాద్-9247593432

 అంశం:-హరుడు
ఉ.
ముక్తికి మార్గమిత్తువని పూవులు కాయలు పత్రహారముల్ 
భక్తిగ దెచ్చిరే హరుడ భక్తుల భావన స్వీకరించరా!
శక్తిని కూడగట్టుకొని జంగమ దేవరవచ్చునే యనిన్
భక్తులుకాపుగాచె గుడి ప్రాంగణమందున సంతసంబుతో
శంకరాభరణం వారి సమస్యకు  పూరణ
******************************

భస్మముదాల్చెడీశునికి భక్తుల జాబిత లంతులేనిదే !
విస్మయమేల సేయుదురు వేడగవచ్చెడి యీశ్వరాకృతిన్
భస్మము లేకసాగునట భక్తులగావ ఖురాను బైబిలై
* క్రిస్మసునాడు సాయబులు కృష్ణుని పూజలొనర్తు రెల్లెడన్* 
అంశం:-శ్రీకరుడు
ఉ.
జీవితకాలగమ్యమున చీకటివేకువ సాధ్యమేగదా!
జీవనబాటలోకలత చీకటిగా తలువెప్పుడైన'నీ
వేకువజాముకైనిదుర పృథ్విన తప్పదుచింతవీడుమా
జీవసమస్తమెల్లరిని శ్రీకరుడే నడిపించునెప్పుడున్