మమతలమ్మ పదాలు:-మమత ఐల-హైదరాబాద్-9247593432
కలతలంటే ఏవి?
సృష్టించిచెప్పునవి
నమ్మితే చింతలవి
ఓ మమతలమ్మ

నిజము చేదుగనుండు
పాట్ల పోట్లూమెండు
ప్రతి జీవితముకుండు
ఓ మమతలమ్మ

ఎక్కడైనా ఉం

డు
జాలి మాటలదండు
అవి వింటె తలపుండు
ఓ మమతలమ్మ

నచ్చినవి విను ముందు
అవి మనసుకొక విందు
మెచ్చనివి వలదందు
ఓ మమతలమ్మ