సమస్యాపూరణ పద్యం:-మమత ఐల-హైదరాబాద్-9247593432

 కారము తీపియై సుఖముగా మురిపించెను భక్తబృందమున్

ఉ.
భారమునీదెయంచు శివపాదముదిక్కనినమ్మినారమే
దూరముజేయబోకుమయ దుర్జనతత్వముమార్చుమాయనిన్
బేరములాడలేక శివప్రేరణలో మునిగేడివారి  కోం
*కారముతీపియై సుఖముగా మురిపించెను భక్తబృందమున్
అంశం:-బోసినవ్వులు
ఆ.వె
పాపబోసినవ్వు పరిమళించిన పువ్వు
విచ్చుకున్న మోము ముచ్చటగును
సిరులవంటి నవ్వు తరగని ముత్యాలు
మనసునిండు చూడమమతలొలుకు