పద్యాలు:-మమత ఐల-హైదరాబాద్-9247593432

 కం
ఆకలి తీర్చే రైతులు
కేకలు పెడుచుండిరిపుడు కిటకిట తోడన్
పైకము నిండని పంటకు
శోకము కర్షకులకొచ్చె చూడుము కృష్ణా!

దత్తపది
ఏకము లోకము శోకము శ్లోకము
కం
ఏకము పాకంబాయెను
లోకములోజనులవింత లోచనచేయన్
శోకము బాపిన విధముగ
శ్లోకము వల్లింతురిట్లు చూడుము కృష్ణా!