చిత్రానికి పద్యాలు:-మమత ఐలహైదరాబాద్9247593432

 కం
నల్లని గోపాలునికీ
పిల్లనగ్రోవియె నగయగు;బృందావనిలో
చల్లగ గానము చేయుచు
పల్లెకు ధన్యతను కూర్చె పావనకృష్ణా!
కం
చల్లని పిల్లనగ్రోవీ
యల్లరి కృష్ణునికరమున నపురూపముగన్
నెల్లము మరిచేవిధముగ
చల్లగ వినిపించునటను సత్యమకృష్ణా!
కం
చల్లని చూపుల రేడా
గొల్లల మదిదోచినట్టి గోవర్ధనుడా
చల్లగ వేణువునూదుచు
పల్లెల విహరించినావె పద్మనయనుడా