పద్యాలు:-- కాలినడక:--మమత ఐల-హైదరాబాద్9247593432

 కం
నడిపించునెచటి కైనను
వడివెట్టెడి యవసరంబు వాహిని వోలెన్
జడవక నటునిటు చూడక
పడిపడి పరుగెత్తుకాలు భయమేలేకన్ 
కం
కాలినడక మేలొసగున్
పాల వయసునుండి ముసలిపండుల కైనన్
తేలికపడు నారోగ్యము
చాలా నుత్సాహమిచ్చు శక్తిని పెంచున్
ఆ.వె
స్థూల కాయమున్న సులువుగా తగ్గేరు
కాలినడక శక్తకొలది నడవ
బద్దకంబురాదు వృద్ధాప్యమైనను
మనసుపెట్టివినుము మమతమాట