పద్యాలు : --మమత ఐల-హైదరాబాద్-9247593432
అంశం:-విమర్శలు
కం
కేసరి కైనను తప్పున
యీసడి దెప్పించునట్టి యీగల బెడదన్
వాసికి నెక్కిన వారికి
రాసుల కొలదిగ విమర్శ రాజ్యంబేలున్

ఆ.వె
సింహ మైన పడదె చిన్న యీగల గోల
యెంత వారినైన చింత పరచ
తగు విమర్శలెపుడు తర్కించి బాధించు
మనసు పెట్టి వినుము మమత మాట

తే.గీ
విలువ గలవారినైనను విడువవెపుడు 
పలువిమర్శల బాధలు కలతబెట్టు
చిన్న యీగలు సింహాల చెంతజేరి
నిక్కముగ విసిగించునే! నిజముకాద
 


అంశం:-జ్ఞానం
కం
జ్ఞానము వంశానుగతము
కానేరదు యెవరికైన; కష్టించనిచో
జ్ఞానము నార్జించుటకై
నేనన్నది విడిచి నేర్వ నేర్పరి తనమౌ

కం
జ్ఞాన మనెడి విత్తమెపుడు
తానే కష్టమున కోర్చి దక్కించునదౌ 
కానల నడిచిన విధముగ 
జ్ఞానము వంశము తొరాదు జ్ఞానైనెరుగన్

అంశం:- 
తే గీ
జీవితమ్మెపుడు సవాళ్లు చేయబూని
రాళ్ళు రువ్విన విధముగా రచ్చ జేసి
విసురుచుండునెల్లప్పుడు వెతలు సల్ప
వీటి నెదిరించు వాడేను విజయుడెపుడు

కం
అందరి కానందమ్ములు
చెందిన సంతృప్తి లేక చిన్న గుణముతో
సుందరముగ బ్రతికెడి వా
రెందరినో నోర్వలేని లీలలు వసుధన్

కం
ప్రతి మనిషికి సుఖమున్నను
యితరుల సుఖమోర్వలేక యెవరికి వారే
నతిగా పరులను చూచుచు
వెతచెందుదురోర్వలేక పృథ్విన మనసా