మమతలమ్మ పదాలు:-మమత ఐల-హైదరాబాద్-9247593432
వంశానికొక మూర్తి
విరజిమ్ము ఘన కీర్తి
వారి మార్గమె స్పూర్తి
ఓ మమతలమ్మ

అహము అహమంటారు
అహములో ఉంటారు
శుభమెపుడు మెచ్చేరు
ఓ మమతలమ్మ

వింత చేష్టలతీరు
గౌరవించిన వినరు
గర్వమని అంటారు
ఓ మమతలమ్మ

భాద్యతలు మరిచేరు
బంధాలు విడిచేరు
గొప్పనుచు మురిసేరు
ఓ మమతలమ్మ

సాకు వెతికే వా

రు
నిజము దాటేస్తారు
మౌనంగ ఉంటారు
ఓ మమతలమ్మ

వేడుకలు ఒకవైపు
ద్వేషాలు మరువైపు
సమపాళ్ళలో మలుపు
ఓ మమతలమ్మ