సమస్యా పూరణ పద్యాలు:-మమత ఐల-హైదరాబాద్-9247593432

 కం.
భీముడు ద్రౌపది కొరకై
భామగ చీరను ధరించి పడచుగ మారెన్
యీమేద్రౌపది యనుకొని
*భీమునిగని కీచకుండు ప్రేమను పంచెన్*
కం
భీముడు శృంగారము గా
భామిని యవతారమెత్తె పాపిని ద్రుంచన్ 
యామే యాభామినియని
*భీముని గని కీచకుండు ప్రేమను పంచెన్*