ఏకపదులు --శీర్షిక:మనసు:--చంద్రకళ. దీకొండ,మల్కాజిగిరి,మేడ్చల్ జిల్లా.చరవాణి:9381361384

 1.రెక్కలు లేని మనసు...రివ్వున ఎగిరి 
దిక్కులు దాటి చేరేటి తీరాలెన్నో...!
2.మానిని మనసున దాగున్న 
బడబాగ్నులెన్నో... వెలిగక్కని రహస్యాలెన్నో...!
3.మౌనమే భాషైన మూగమనసులోన...అణగి
ఉన్న ఆవేశకావేశాలెన్నో...!
4.చిత్రమైనది మనసు...క్షణానికో విధంగా చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ...!
5.అదుపులో ఉంచితే మనసును...అందిస్తుంది అద్భుతమైన ఆనందాలెన్నో...!!!