త్రిపదలు:-చంద్రకళ. దీకొండ,మల్కాజిగిరి,మేడ్చల్ జిల్లా.చరవాణి:9381361384
 
1) పచ్చని మైదానాలు ఎడారులు...
ప్రవహించే నదులు అంతర్వాహినులు...
మానవుల స్వయంకృతాపరాధం...!
2)ఒకవైపు మండే ఎండల వేడి...
పైనుంచి అకాల వర్షం దాడి...
గోరుచుట్టుపై రోకటిపోటుతో రైతన్న...!
3)కయ్యానికి కాలు దువ్వే తత్వం...
కరోనాతోనూ నేర్చుకోని గుణపాఠం...
మళ్ళీ మొదలెట్టిన సరిహద్దు పోరాటం...!
4)మంచితనపు ముసుగుతో 
నటించే లోకంలో...
ముసుగు తొలగించిన ప్రతినాయకుడు...
ఫలితంగా వెల్లువెత్తిన మానవత్వం...!
5)ప్రజల బాధ్యతారాహిత్యం...
పాలకుల పదవీ వ్యామోహం...
వెల్లువెత్తిన కరోనా రెండోకెరటం...!