*ప్రక్రియ:సున్నితం* :- *రూపకర్త* : *శ్రీమతి**నెల్లుట్ల సునీత*:-చంద్రకళ. దీకొండ,మల్కాజిగిరి,మేడ్చల్ జిల్లా-చరవాణి:9381361384

 ౪౬
ఎంతో చిన్నది జీవితం
కోపతాపాలతో కానివ్వకు భారం
చిరునవ్వు శాంతిబావుటాను ఎగురవేయి
చూడచక్కని తెలుగు సున్నితంబు...!
౪౭
చిరకాలం ఉండేవే చింతలు
చిగురంత చిరునవ్వు నవ్వు
చిత్రంగా చింతలు దూరంకానివ్వు
చూడచక్కని తెలుగు సున్నితంబు...!
౪౮
నవ్వుతూ నవ్విస్తూ గడుపు
చిన్నారుల బోసినవ్వును చూడు
హృదయం తేలికవకుంటే అడుగు
చూడచక్కని తెలుగు సున్నితంబు...!
౪౯
మనసుతీరా నవ్వులు రువ్వు
మనసులోని బాధను దూరంకానివ్వు
అనారోగ్యాన్ని పారద్రోలే దివ్యౌషధమది
చూడచక్కని తెలుగు సున్నితంబు...!
౫౦
పెదవులపై విరబూసే నవ్వులతో
పదునాలుగు ముఖకండరాలకు వ్యాయామం
చిరునవ్వుతోనే పూర్తగును అలంకారం
చూడచక్కని తెలుగు సున్నితంబు...!