వ్యాక్సినేషన్ అందుబాటు :-బెజుగాం శ్రీజ-ట్రిపుల్ ఐటీ బాసర-గుర్రాలగొంది జిల్లా సిద్దిపేట-చరవాణి:9391097371
 1ఆ.వె.
మానవాళియందు మహమారిదికరోన
వచ్చిచేరినాది వదలకుండ 
నీవిధానవ్యాధి నెందరో మనుషుల
ప్రాణములనుతీసి బలినికోరె
2ఆ.వె.
వ్యాక్సినేసుకొనగ వైరసురాకుండ 
రక్షణిచ్చుచుండు రయముగాను
నధికముగనుమనము నారోగ్య వంతులై
శక్తిపెంచునదియె యుక్తికొఱకు