పద్యాలు : -బెజుగాం శ్రీజ-ట్రిపుల్ ఐటీ బాసర-గుర్రాలగొంది జిల్లా సిద్దిపేట-చరవాణి:9391097371

 1ఆ.వె.
నేతకార్మికులును నేర్పుగా పనిజేసి
మంచిచీరనేసె యెంచిచూడ
అందమైనచీర నలరారు విధముగ
 ప్రజల మెప్పుబొందె భవ్యముగను 
2ఆ.వె.
వనిత చీర కట్ట వయ్యారి భామలా
కంటి కింపుగాను కాన బడగ
ముట్టు కొనగ కురియు ముత్యాల హరివిల్లు
సొగసు చూడ తరమె చూపరులకు