పద్యాలు : -బెజుగాం శ్రీజ ట్రిపుల్ ఐటీ బాసర గుర్రాలగొంది జిల్లా: సిద్దిపేట చరవాణి:9391097371


 1ఆ.వె.
ప్రేమలేఖవదిలి ప్రీతితోచదవగ
ముందుకెళ్లగలరు నెందునైన
బాల్యమందు గురువు బాటనే నడిచిన
మంచి పేరు వచ్చు మనకు నెపుడు 
2.ఆ.వె.
పాఠశాలకేగి పాఠాలు నేర్వగ
మనసు పెట్టి చదువ మంచి జరుగు
వయసు పెరుగు కొలది పడతారు ప్రేమలో
జీవితమునుపాడు చేసుకొనియు.