పద్యాలు :-బెజుగాం శ్రీజ-ట్రిపుల్ ఐటీ బాసరగుర్రాలగొంది జిల్లా సిద్దిపేట-చరవాణి:9391097371


 1. తే.గీ.
వాన లేకను పంటలు పండకుంటె
రైతుబాధలుపడునెన్నొ రందిపడుతు
ఫలితమేమియురాకను ప్రాణములను
బలినితీసుకొనుటకును పాటుబడెను
2.
వేలు ఖర్చుబెట్టి వేయగాపంటను
దిగుబడింతరాక దిగులు బడుచు
ఎడ్లపట్టుకొనియునేడ్చుచు నుండగా
కంటినీరు దీసె కాడియెడ్లు