పద్యాలు :-బెజుగాం శ్రీజ-ట్రిపుల్ ఐటీ బాసరగుర్రాలగొంది జిల్లా సిద్ధిపేటచరవాణి:9391097371


 1ఆ.వె.
రామచరితయంత రమణీయ దృశ్యంబు 
కనులకద్దినట్లు కానబడెను
చిత్రకారుడెంతొ చేతతో గీసియు
మెప్పుపొందెజనుల గొప్పగాను
2తే.గీ.
అంజనీమాత తనయుడు హనుమ యెపుడు
రామనామమేతలచును రమ్యముగను
లంక దహనమే జేసియు రావణుడిది
గర్వమణచెనుతానెంతొ గౌరవముగ