వీరవనిత:-బెజుగాం శ్రీజట్రిపుల్ ఐటీ బాసరగుర్రాలగొంది జిల్లా సిద్ధిపేటచరవాణి:9391097371.


 1తే.గీ.
విల్లునే చేతబట్టియు వీరనారి
కదనరంగమునందున కాలుదువ్వి
అబలకాదనిగొప్పగా సబలగాను 
ధైర్యసాహసమ్మునుచాటె ధరణియందు.
2.తే.గీ.
రాణి రుద్రమ,ఝాన్సిగా రణమునందు
సాటి నిలుచుచు గెలుచును మేటిగాను
పురుష సమముగ  పోరాడి పుడమి పైన
వీరవనితల సరసన చేరి నిలుచు