1. అమ్మ మాట అమాయకం
గ్రహించు,
అమ్మ మాట ఆత్మీయం
పంచు,
అమ్మ మాట ఇంపు
ప్రకాశించు,
అమ్మ మాట ఈప్సితం
నెరవేర్చు.
2. అమ్మ మాట ఉగ్గు తాగాలి
అమ్మ మాట ఊరట
పొందాలి,
అమ్మ మాట ఎరుక
కలగాలి,
అమ్మ మాట ఏరువాక
ఆరంభించాలి.
3. అమ్మ మాట నెమ్మది
వినాలి,
అమ్మ మాట చల్లనిది
సేదతీరు,
అమ్మ మాట కమ్మనిది
హాయి పొందు,
అమ్మ మాట చెరగనిది
మరువకు.
4. అమ్మ మాట ఓరిమి
ప్రదర్శించాలి,
అమ్మ మాట కూరిమి
పెంచుకోవాలి,
అమ్మ మాట మేలిమి
నిలబెట్టాలి,
అమ్మ మాట బలిమి
తగ్గకుండాలి.
5. అమ్మ మాట విద్వత్తు
నేర్పాలి,
అమ్మ మాట గమ్మత్తు
నవ్వాలి,
అమ్మ మాట మహత్తు
చేరాలి.
*అమ్మ మాట జగత్తు*
*తెలియాలి*
*మాతృదినోత్సవ* *శుభాకాంక్షలు*
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి