సున్నితం ;రూప కర్త :- నెల్లుట్ల సునీత. కరోనా కష్టాలలో మనో ధైర్యం. మైలవరపు వెంకటలక్ష్మణ రావు. " లక్ష్మణ్ ".కాకినాడ. జిల్లా :- తూర్పు గోదావరి.-చర వాణి: 94413 28073.
 ( 6 ).
ఓ మనిషీ!  ధైర్యాన్ని వీడకేప్పుడు               
ఒత్తిడిని  జయించు మనోబలంతో               
భయంవీడి పోరుబాట పట్టు
చూడచక్కని తెలుగు సున్నితం బు
                    
( 7 ).
" కరోనా " నీవెవరో తెలియదు
నీవెలా  వస్తావో  తెలియదు
నీవెందుకు వచ్చావో తెలియదు 
చూడచక్కని తెలుగు సున్నితం బు
                    
( 8 ).
నోటికి  మాస్క్ కట్టుకో
భౌతిక  దూరం పాటించు
నీఇంటనే  వుండమని అన్నారు
చూడచక్కని తెలుగు సున్నితంబు
                  
 ( 9 ).
ఎక్కడ ఏమౌతుందో తెలియదు
ఎప్పుడు ఏమాట వింటామో
ఎవరికెవరు ఏమౌతారో తెలియదు              
చూడచక్కని తెలుగు సున్నితంబు
                   
( 10 ).
నలుగురూ కావాలని కోరుకో
మనమంతా ఒకటేనని అనుకో
చివరకు  కావాలి  ఆనలుగురు
చూడచక్కని తెలుగు సున్నితం బు