చిన్న పిల్లలంత కలిసి
కోలలన్ని బట్టుకొని
తీయనైన పాటలతో
తిరిగి తిరిగి ఆడుచుంటె
ఆనందం పొందిరి
పాటలన్ని పాడిరి
చెలియ లంత కలుపుకుని
కాళ్ళు కాళ్ళు కదుపుకుంటు
చప్పట్లుచరుచుకుంటు
ముందు వెనుక కెగురుకుంటు
చెమ్మచెక్క లనుకుంటు
మురిపెంతో ఆడుతారు
చెట్టు పుట్ట తిరిగినాము
పూలన్నితెచ్చినాము
బతుకమ్మ పేర్చినాము
ఊరు మధ్యల నిలిపినాము
ఊయలపాటలన్ని
ఊగుకుంటు పాడినాము
కట్టెపుల్ల పట్టుకొని
డబ్బలన్నిగీసుకుంటు
చారుపత్త ఆటలను
శ్రద్ధతోటి ఆడుతాము
ఓడినోళ్ళు కుంటుకుంటు
పల్లీలను తేర్పుతారు
దాగుడుమూతలాటలు
కళ్ళు మూసి ఆడుతారు
ముక్కు గిచ్చి పోతారు
గిచ్చి నోళ్ళెవరినో
తెలుసుకొమ్మంటారు
తెలుసుకుంటేను
ఓటమి పాలు అవుతారు
ఆటలండి ఆటలు
చిన్న పిల్లలాటలు
చిత్రమైన ఆటలు
పోటీపడిఆడుతారు
గెలవాలని చూస్తారు
ఓడిపోవుచున్నకొలది
గెలుపుకై పోరాడుతారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి