మా కిష్టం:---కయ్యూరు బాలసుబ్రమణ్యం 9441791239
వీచె గాలి
పూసె పువ్వు
మాకిష్టం..మాకిష్టం

ముసిరే వాన
మురిసే పైరు
మాకిష్టం..మాకిష్టం

మెరిసే మెరుపు
ఉరిమే ఉరుము
మాకిష్టం..మాకిష్టం

కురిసే మంచు
విరిసే వెన్నెల
మాకిష్టం..మాకిష్టం

లేచే కెరటం
ఉరికే ఉప్పెన
మాకిష్టం..మాకిష్టం

వెలిగే తార
కడిగిన ముత్యం
మాకిష్టం..మాకిష్టం

పారే ఏరు
పెరిగిన ఊరు
మాకిష్టం..మాకిష్టం

మొక్కిన గుడి
చదివిన బడి
మాకిష్టం..మాకిష్టం