*అక్షర మాల గేయాలు*:-గేయం- ఇదిగో రారా కన్నయ్యా!:- *వురిమళ్ల సునంద,ఖమ్మం* 9441815722

 ఇసుకలో ఆడే చిన్నయ్యా
ఇంటి లోపలికి రావయ్యా
ఇరుగు పొరుగు పిల్లలతో
ఇచ్ఛకాలు వద్దయ్యా
ఇప్పుడే నీకు తెచ్చామూ
ఇదిగో బొమ్మలు చూడయ్యా
ఇష్టమైన వాటన్నింటితో
ఇంపుగా ఆడుకోవయ్యా