*అక్షర మాల గేయాలు* *'ఏ' అక్షర గేయం* *గేయం:* *ఏనుగమ్మా..ఏనుగమ్మా*:- *వురిమళ్ల సునంద,ఖమ్మం*-9441815722

 ఏనుగమ్మా! ఏనుగమ్మా!
ఏమిటి నీ విశేషాలు?
ఏమున్నయి? ఏమున్నయి?
ఏటి ఒడ్డుకు వచ్చానూ
ఏటి ఒడ్డున నీకు ఏమి పని వున్నది?
ఏటి లోన జలకమాడాలని ఉన్నది
ఏరు ఇచ్చే తియ్యని నీరు 
తాగాలని ఉన్నది
ఏనుగమ్మా! ఏనుగమ్మా!
వస్తావా మావూరు?
ఏరేరి చెరకు గడలు కోసి నీకు పెడతాము...