*అక్షర మాల గేయాలు* ' *ఐ' అక్షర గేయం* *గేయం: ఐకమత్యమంటే...* :- -వురిమళ్ల సునంద, ఖమ్మం-9441815722

 ఐకమత్యమంటే తెలుసా కన్నా
ఐదువేళ్ళవలె  కలిసుండుటే చిన్నా
ఐక్యంగా తిరిగే చీమల్ని చూడరా కన్నా
ఐకమత్యంతో బరువుల్ని మోస్తాయిరా చిన్నా
ఐకమత్యమే మహాబలం కన్నా
ఐక్యంగా ఎల్లప్పుడూ ఉండాలన్నా
ఐరావతమంటే తెలుసా చిన్నా
ఐరావతమంటే తెల్ల ఏనుగురా కన్నా
ఐశ్వర్యమంటే ఏమిటో తెలుసా చిన్నా
ఐశ్వర్యమంటే సంపదని అర్థం కన్నా..
ఐక్యతనెడి ఐశ్వర్యాన్ని మనమంతా పొందాలి
ఐక్యతయే జాతి జీవనాడి అని తెలియాలి.