అక్షర మాల గేయాలు-ఒ' అక్షర గేయం-గేయం: ఒకటే ఒకటే ఒకటే..: --వురిమళ్ల సునంద, ఖమ్మం-9441815722

 ఒకటే  ఒకటే ఒకటే
ఒకటే మనమంతా
ఒకటీ ఒకటీ ఒకటీ
ఒంటరి ఎవరు కాదంటా
ఒకటి ఒకటి ఒకటి
ఒకరికి ఒకరం తోడంటా
ఒకటే  ఒకటే ఒకటే
ఒకటే లక్ష్యం మనదంటా
ఒకటి ఒకటి ఒకటి
ఒజ్జ దగ్గర చదువంటా
ఒకటి ఒకటి ఒకటి
ఒకటిగా ఒంటెను చూద్దామంట
ఒకటి ఒకటి ఒకటి
ఒంటెను ఎక్కి తిరుగుదమంట