*అక్షర మాల గేయాలు* *'అం ' అక్షర గేయం* *శీర్షిక: అందరాని చందమామ* : -*వురిమళ్ల సునంద,ఖమ్మం* 9441815722

 అందరాని చందమామ 
కావాలని అందాల రాముడు 
అల్లరెంతో చేశాడు 
అంగడిలో అద్దమొకటి 
తీసుకుని వచ్చాను 
అంబరాన జాబిల్లిని 
అందుకున్నాననీ 
అందులోన చూడగానే
 కిలకిలా నవ్వాడు 
అంతటా ఆ నవ్వులన్ని 
పువ్వులై విరిసాయి