అక్షర మాల గేయాలు-*'ఔ' అక్షర గేయం* శీర్షిక: ఔటుతో..:- -వురిమళ్ల సునంద, ఖమ్మం--9441815722
 ఔటుతో ఆడే చిన్నయ్యా
ఔటుతో ఆటలు వద్దయ్యా
ఔననక చెప్పిన వినకుండా
ఔతలికెళ్ళి దానితో ఆడావా
ఔటు చేతిలో పేలిందా
ఔదల దాల్చక మంచి మాటలను
ఔరా ఎంత పని చేసావు
ఔషధమిస్తా త్వరగా రావయ్యా