ఆడంబరంతో పతనారంభం :- గుర్రాల వేంకటేశ్వర్లు. ఆసిఫాబాద్ 9490918014.
ఏదో ఆవేశం...
ఇంకేదో ఆతృత...

అందరిలో ఒక్కడిగా...
అందరికంటే గొప్పగా..

నేనంటేనే ప్రత్యేకంగా కనిపించాలనే తాపత్రయం...

దానికై ఎంత ఖర్చైవెనుకాడలేదప్పుడు..

అందుకు ఎంత అప్పైనా వెరవలేదప్పుడు..

నిజమే..
ఇది ఒకప్పటి మాట ..
కళ్ళపై అహంకారపు పొర కమ్మినప్పటి తీరు*...

ప్రవర్తనలో నిర్ధిష్ట తీరు ఉండాలని...
మనసుకు మంచి సొగసులద్దాలని..

బాహ్యసౌందర్యం బహు కొద్ది క్షణాలని..

ఆడంబరాలతో గుర్తింపు రాదని.....

ఆస్తులన్నీ పోయి
మనిషి రోడ్డున పడ్డాకే తెలిసిందిప్పుడు..

అప్పులాళ్ళ కంటపడక దాగినప్పుడే నాగుర్తింపేమిటో అవగతమైంది...

అనవసరమైన ఖర్చుతో 
నా అతిశయపు ఆర్భాటంతో కోరుకున్నది కాక వ్యతిరేకదిశలో పేరు తెచ్చుకున్నాను...

చేతులు కాలాక నీతిని బోధిస్తున్నాను..

                  ....జీవి.