గుడుగుడు గుంచం పిల్లలం
అడుగిడి ఆడు తోడు మల్లెలం
ప్రతి ఆటకు పోటీ సూటిగ చేస్తాం
శృతి లయ పాటకు గానం చేస్తాం!
ఆటలంటే మాకు ఇష్టం
పాటలంటే మరింత ఇష్టం
కష్టమైన స్పష్టంగా పాడుతం
ఇష్టమై మేం చెలరేగుతం
పాటకు పల్లవి ప్రాణం
ఆటకు చెల్లదు నిస్త్రానం
గురువు చెప్పిన ఈ మాట
మరువం ఎప్పుడు ఏ పూట!
ప్రత్యర్థులతో పడుతాం మేం పోటీ
ప్రతి ఆటకు పాటకు చేస్తాం పోటీ
ఏ ఆటపాటలో ఓటమి ఎరుగం
గెలిచే వరకు మేమిక జరుగం. !
ఆటపాటల ఆయువు పట్టి
తెలివి తేటలతో మేంజత కట్టి
మైదానంలో ఆడుతాం నిత్యం
మా విధానంలో విజయం సత్యం!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి