బ్రహ్మ జ్ఞానం:-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్ నెంబర్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.

 రామాపురం గ్రామంలో ధననందుడు అను ధనవంతుడు ఉండేవాడు.ఊరిలోని వారందరికి అరువుపై సరుకులను ఇచ్చి బాగా డబ్బు సంపాదించాడు.ఆ ఊరిలో ఇంకా ఒకటి,రెండు దుఖానాలున్నప్పటికీ,వారు అరువిచ్చేవారు కానందున ధననందుని దుఖానానికి వచ్చే జనం సరుకులు తీసుకుపోయే వారు.దీన్ని ఆసరాగా తీసుకొని ధననందుడు అధికధరలకు సరకులమ్మి అతి తొందరలోనే ధనవంతుడైపోయాడు

        ధననందుని భార్య అప్పడప్పుడు"మనకు ఎంత ధనం ఉంటే ఏమిటి లాభం.నీకూ చదవుకొనె జ్ఞానం లేకపాయె, నీ పిల్లలకు చదువు రాకపాయె"అని దెప్పి పొడుస్తుండేది. భార్య మాటలకు ప్రభావితుడైన ధననందుడు ఎలాగైనా జ్ఞానము సంపాదించాలని ఆలోచించి తన మిత్రుడైన దయానంద్,ను సలహా అడిగాడు. "చూడు మిత్రమా! జ్ఞానమును సంపాదించాలంటే గురువును ఆశ్రయించాలి. ఆ గురువుగారు బ్రహ్మ జ్ఞానమును బోధిస్తే నీకు తప్పక జ్ఞానము విజ్ఞానము లభిస్తుంది"అని అని సలహా ఇచ్చాడు.
సలహా విన్న ధన నందునికి తన కులదైవం సాయిబాబా గుర్తుకొచ్చాడు. వెంటనే భార్యకు చెప్పి గురువును కలిసే టందుకు
 షిరిడి కి ప్రయాణమై పోయాడు.
షిరిడిలో సాయిబాబా ను కలిసి"బాబా! మీరు ముముక్షువులకు తక్షణమే బ్రహ్మజ్ఞానము ఇస్తారని, విని వ్యయప్రయాసలకోర్చి వచ్చాను"
అన్నాడు. అప్పుడు సాయి నవ్వి
" నా వద్దకు అందరూ కోరికలతో వచ్చేవారే, బ్రహ్మ జ్ఞానమును కోరేవాడు దొరకడమే నా అదృష్టం"
అన్నారు. ధననందుడు పొంగిపోయాడు. సాయి అతనితో మాట్లాడుతూనే ఒక పిల్లవాని ని పిలిచి తనకు అప్పుగా రూ.5/తెమ్మని చాలామంది వర్తకుల దగ్గరకు పంపుతున్నారు. ప్రతిసారి ఆ పిల్లవాడు వచ్చి వర్తకుడు లేడనో, అప్పు దొరకలేదనో సాయి తో చెబుతున్నాడు. ఇదంతా చూస్తూ కూడా ధననందుడు పైసా రాల్చకుండా " బాబా! నేను వెళ్ళాలి త్వరగా బ్రహ్మజ్ఞానము ప్రసాదించండి" అన్నాడు. సాయి,
" నా యత్నం అంతా అదే! కాని నేనేమి చేసేది? జ్ఞానం కావాలంటే
1). పంచ ప్రాణాలు.2). జ్ఞానేంద్రియాలు.3)మనస్సు. 4).బుధ్ధి.5). అహంకారం. ఈ ఐదింటిని భగవంతునికి అర్పించాలి. అది ఎంతో కష్టం.
నీ వద్ద నాకు అవసరమైన దానికి యాబైరెట్లున్నా ఫకీరుగా నాకు అర్హత లేదు కాబట్టి అప్పు లభించలేదు డబ్బే నీ పాలిటీ బ్రహ్మం. దానిపై మోహం నశిస్తేగాని జ్ఞానం కలగదు." అన్నారు సాయి.
అంటే బాబా వద్ద జ్ఞానం ఎంత ఉన్నా అర్హతలేని ఆ ధన నందునికి
ఆ బ్రహ్మజ్ఞానం లభించలేదు.
           ఏసు కూడా ఇటువంటి ధనవంతుని తోనే"సూది బెజ్జం లో నుంచి ఒంటైనా పో గలదేమో గానీ,
స్వర్గ ద్వారం లోకి ధనికుడు మాత్రం పోలేడని" చెప్పారు. వాచా, మనసా, కర్మ ఆత్మ బ్రహ్మజ్ఞానం కోరినా లభించదు. డబ్బు పైన ప్రీతి మానవుని ప్రవర్తన అంతటిని మలచిన ట్లు ముముక్షుత్వం వచ్చినప్పుడే అది వాస్తవ మై మనకు బ్రహ్మజ్ఞానము లభిస్తుంది." అని సాయి చెప్పగానే
ధననందుడు సిగ్గుతో తలవంచుకొని అక్కడి నుండి  వెళ్ళిపోయాడు.