హుషారు పిల్లలం;-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.-సెల్.9491387977.-నాగర్ కర్నూల్ జిల్లా.

చిరు చిరు నవ్వుల పిల్లలం
సిరి సిరి మువ్వల మల్లెలం
ఆనందం పొందిన వారలం
అనుబంధం చిందిన పోరలం !

మేం స్వంతం మా చదువుల 
జోరును జోరుగ కొనసాగిస్తాం
మా పంతం పదవుల హోరును
మేం కని విని వెంటనేసాధిస్తాం !

ఆ హోరులో జోరులో ఖుషీగా
మేం అంతా మా షికారు చేస్తాం
మా మంచి తీరు దారి మారని 
పోరులో మా హుషారు చూస్తాం !

చదువుల సిరియే మాకు ముఖ్యం
ఏ పదవిలో లేదు అలాంటి సౌఖ్యం
అందుకే సాధిస్తాం చదువుల సిరి
పొందుగ శోధిస్తాంపదవులపై గురి !

మాటలమంత్రాలు నేర్చుకున్నాం
ఆటలయంత్రాలు కూర్చుకున్నాం
ఆటపాట తంత్రాలు కనిమేంకట్టాం
మా నోటి అంత్రాలు కొని విడగొట్టాం