దారి చూపిన మానవత్వం:-చిట్టి కథ. :-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్ నెంబర్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.

 అగ్రహారం అనే కుగ్రామంలో అడివయ్య, ఐలమ్మ అ అనే భార్యాభర్తలు నివసిస్తూ ఉండేవారు. వారికి ఓ కుమార్తె, ఓ కుమారుడు కూడా ఉన్నాడు. కుమారుని పేరు రాజు, కుమార్తె పేరు రాణి. తల్లిదండ్రులు వారికున్న ఐదు ఎకరాల పొలం లో పొద్దస్తమానం కష్టపడుతూ పనిచేస్తుండేవారు. లభించిన ఫలసాయాన్ని పొదుపుగా వాడుకుంటూ తమ ఇద్దరి పిల్లలను ప్రక్క టౌన్ లో ఓ ప్రైవేటు పాఠశాలలో చదివిస్తూ ఉండేవారు.
          రాజు, రాణి ప్రతిరోజు చదువు కోసం బస్సులో టౌనుకు వెళ్ళి వస్తుండేవారు. ఆ ప్రకారంగానే ఒకరోజు వారు హడావిడిగా టౌన్ బస్సు ఎక్కబోయి ప్రమాదవశాత్తు కింద పడ్డారు. రాజు కుడికాలు విరిగి వికలాంగుడైనాడు. రాణి కి మాత్రం
గాయాలయ్యాయి. రాణి అన్న కాలు రక్తసిక్తమై ఉండుట గమనించి తట్టుకోలేక మన స్థిమితం కోల్పోయి పిచ్చి దైయింది. పాపం ఆ భార్యభర్తలకు అప్పట్నుంచి కష్టాలు ప్రారంభమైనాయి. పిల్లల వైద్య ఖర్చుల నిమిత్తం ఐ ఓ మూడు ఎకరాల పొలం అమ్ముకోవలసి వచ్చింది. పిల్లల చదువులకు పులిస్టాప్ పెట్ట వలసివచ్చింది.
రాజు కోలుకొని చెల్లి రాణిపరిస్థితి గమనించి నిరంతరం చింతిస్తూ ఉండేవాడు. మా ఊరిలోనే మన స్థిమితం కోల్పోయిన రోగులను సారి చూసి వైద్యం అందించే ఉచిత క్యాంపు పడుతుందన్న విషయం తెలుసుకుని సంతోషిస్తూ తాను పడుతున్న చింతను దూరం చేసుకొని ఆ క్యాంపుకు తన చెల్లి రాణిని తీసుకెళ్లాడు. డాక్టర్లు పరీక్షించి ఉచితంగా వైద్యం అందించారు. కొన్ని ఉచిత మందులు కూడా ఇచ్చి ఓ ఐదు నెలల్లో నయమవుతుందని చెప్పారు. ఆ మాటలకు పొంగిపోయి రాజు చెల్లి రాణిని తీసుకుని వస్తూ క్యాంప్ కాంపౌండ్ సమీపంలోనున్న నీటి తొట్టెలో పడి చావుబతుకుల్లో కింద మీద అవుతున్నా మూడు సంవత్సరాల బాలుని చూశాడు. ఆగమేఘాలపై పరిగెత్తి ఆ బాలుని కాపాడాడు రాజు.
             తక్షణం ఈ విషయం డాక్టర్ విమల కి ఫోను ద్వారా తెలిపాడు రోగులను పరీక్షిస్తున్న డాక్టర్ విమల హడావిడిగా క్యాంపు కాంపౌండ్ నీటి తొట్టి లో ఉన్న చోటికి వచ్చి నేలపై వైద్యం అందిస్తున్న తన తోటి డాక్టర్లను, తన ముద్దుల కుమారుడైన కిరణ్ ను చూసి ఆశ్చర్యం ఆందోళనతో నాయనా కిరణ్ అంటూ పెద్దగా అరిచింది. ఆదుర్దాతో తన కుమారుణ్ణి గుండెలకు హత్తుకుంది. అప్పుడుగాని జనానికి, తనకు తన తోటి డాక్టర్లకు నీటి తొట్టి ప్రమాదంలో పడిన బాలుడు డాక్టర్ విమల గారి కుమారుడని తెలియరాలేదు.
            వెంటనే అక్కడి జనం, వైద్య క్యాంపు సిబ్బంది అంతా రాజును చూసి తెగ మెచ్చుకున్నారు. తన కన్నులారా నీటి తొట్టి ఆపద నుంచి రక్షించబడ్డ
తన బిడ్డను చూసుకొని డాక్టర్ విమల తన తొట్రుపాటు నుండి తేరుకొని బిడ్డను కాపాడిన రాజును గూడా తన గుండెలకు హత్తుకుంది.
         ఆమే చొరవను అర్థం చేసుకున్న రాజు,తన చెల్లి రాణిమతిస్తిమితం గురించి చెప్పాడు.విన్న డాక్టర్ విమల "చూడు రాజూ నీవు నా బిడ్డను కాపాడావు. ప్రత్యుపకారంగా గా మీ చెల్లి రాణికి ఎంత డబ్బైనా ఖర్చుపెట్టి ఆ మాత్రం వైద్యం చేయించకుంటే నా వైద్య వృత్తికే అవమానం. నీవేమి దిగులు పడవద్దు లండన్ నుండి నాకు తెలిసిన ఓ మంచి డాక్టర్ ఈ పది రోజుల్లో మన టౌన్ కు వస్తున్నారు. అతనికి చూయించి వైద్యం చేద్దాం. నువ్వేమి బాధపడవద్దు. అంది కమల డాక్టర్.
డాక్టర్ విమల మాటలకు పొంగిపోయిన రాజు విమల గారికి కృతజ్ఞతలు తెలిపి తన చెల్లి రాణిని తీసుకుని ఇంటికొచ్చి తన తల్లిదండ్రులకు జరిగిన వృత్తాంతమంతా తెలియ చెప్పగా, వారు ఎంతో ఆనందంతో కుమారున్నీ రాజును, కుమార్తె రాణిని  తమ గుండెలకు హత్తుకొని ని ఆనంద భాష్పాలు రాల్చారు.