మన ధ్యానం-మన సహనం:-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.-సెల్ నెంబర్.9491387977-నాగర్ కర్నూల్ జిల్లా.
సహనం సహనం సహనం
సాహస ఆవాహన గమనం
సాధన చేసి సాధిద్దాం మనం
వేదన బాసి ఉందాం అనుదినం!

సహనం సహనం సహనం
సహనం మన ప్రగతి సూత్రం
ఆవాహన ఘన జాగృతి నేత్రం
ధ్యానం అధ్యయనం స్వరగాత్రం!

ధ్యానం గత జన్మల కర్మఫలం విముక్తి
ధ్యానమే భోగం మరి జ్ఞానమే వైరాగ్యం
ధ్యానం పరమోన్నత స్థితిని అందిస్తుంది
దేహమందున్న మన దోషాలను తొలగిస్తుంది!

దుష్టత్వాన్ని దూరంగా ఉంచుతుంది
బ్రష్టత్వాన్ని భారంగా వంచుతుంది
మౌన తత్వాన్ని మదిలో పెంచుతుంది
స్నేహ తత్వాన్ని అందరికీ పంచుతుంది!

ధ్యానం అధ్యయనం వల్ల వెలుగు క్రాంతి విక్రాంతి
పరధ్యానం వ్యయమై కలుగు శాంతి ప్రశాంతి
ధ్యాన సాధన జీవన పావన మా సంజీవి
అజ్ఞాన వాదన వేదనను వధించే మా సహజీవి!

సంపూర్ణ సహనంతో మనం జీవిద్దాం
సాధ్యం కానిది ఇలలో లేదని నిరూపిద్దాం
సహనం కోల్పోకుండా ఉండేలా ప్రేరేపిద్దాం
సహన సాధనకై మనమంతా ప్రిపేరై వద్దాం !