కార్మిక పిల్లలం:-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్ నెంబర్.9491387977.నాగర్ కర్నూలు జిల్లా.
మేము కార్మిక రంగం పిల్లలం
మా శ్రామిక సంఘం మల్లెలం
శ్రమ శక్తిని అమ్ముకున్న వారలం
ప్రభుభక్తిని నమ్ముకున్న పోరలం!

పని కోసం పరుగులు తీస్తుంటం
గనిలో గూడా మేం పనిచేస్తుండటం
కలిసిమెలిసి పనిని పంచుకుంటాం
ఇలవెలసి ఖ్యాతిని పెంచుకుంటాం

పని పాట కై ప్రయాస పడతాం
గని గాసంకై స్వయాన వేడుతాం
అందుకొని సొమ్ము పంచుకుంటాం
విందు గొని బంధం పెంచుకుంటాం!

మా అప్పుల తిప్పలు చెప్పుకోలేక
ఆ తప్పులముప్పలు విప్పుకోలేక
వడ్డీ సంతలోమేం గుడ్డిగా తిరిగాం
నడ్డి విరిగి ఓ దొడ్డి దారిని మరిగాం

వెట్టిచాకిరి పనులు తట్టుకోలేక
గట్టిపట్టు తో గనుల పట్టుకోలేక
బురదగుంటలో దొర్లుతున్నాం
దురద మంటలో పొర్లుతున్నాం!

పట్టుదలతో మేం పని చేస్తుంటాం
గుట్టుగా జీవితాన్ని నెట్టుకొస్తుంటాం
ఒక్కోసారి పని లేక పస్తులుంటాం
మొక్కవోని శక్తితో పనిగావిస్తుంటాం

మెతుకు లేక మేం చితుకుతుంటం
అతుకుల బతుకై బతుకుతుంటం
మా శ్రమశక్తినే మేం నమ్ముకుంటం
సక్రమభుక్తితోమేం గమ్ముగుంటం!

సర్కారు ఆదేశంతో పనిచేస్తుంటం
తకరారు లేని సందేశం ఇస్తుంటం దేశ ప్రజలంతా మా అన్నదమ్ములు
ఆదేశ సూత్రాలే మాకున్నధమ్ములు!

ఉపాధి కోల్పోయి ఉన్న వారలం
ఉప్పెన

వచ్చిన పని ఆపని పోరలం
పారిశ్రామిక వేత్తల వద్దకు చేరుతాం
మాకు పని ఇమ్మని మేం కోరుతాం!

మేం ఇచ్చిన పనిని చక చక చేస్తాం
మెచ్చి ఇచ్చిన సొమ్మును గ్రహిస్తాం
సంసారం సరుకుల ఆవిష్కరిస్తాం
అపార సమస్యల పరిష్కరిస్తాం !

మా శ్రమ పనిముట్లను పూజిస్తాం
ఆ శ్రమ కనికట్లను మేం గమనిస్తాం
శ్రమ సౌందర్య మును ప్రేమిస్తాం
శ్రమ జీవనయాత్రను కొనసాగిస్తాం!