శాంతి కాంతి పిల్లలం:-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి-సెల్ నెంబర్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.
మాట మంతి పంచుకున్న పిల్లలం
ఆట పాటమేంఎంచుకున్న మల్లెలం
శాంతివనంలోప్రవేసించిన వారలం
కాంతిసదనంలోవసించిన పోరలం!

ప్రతిరోజు బడి బాట పట్టుతాం
శృతి చేసి మద్దెలదరువు కొట్టుతాం
విద్య ఆవశ్యకతను నొక్కిచెప్పతాం
మధ్యభవిష్యవాణిచిక్కు విప్పతాం

చదువుల తల్లి చరణాలను స్పర్శిస్తాం
పదవుల మల్లి తిరణాలను దర్శిస్తాం 
చదువుల సిరి రక్షణకోసం ప్రార్థిస్తాం
పదవుల గురి పర్యవేక్షణ మేం చేస్తాం

మేం బడిలో చేస్తాం మధ్యాహ్న భోజనం
ఆ గుడిలో చూస్తాం రంగుల టెలివిజన్
చదువుల పై ఆసక్తిని పెంచుకుంటాం
పదవులపై అనురక్తిని తీర్చుకుంటాం