నిత్యసత్యాలు:-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్ నెంబర్.,9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.

 1.అవినీతి సుడిగాలి వంటిది
ఆగాలిలో నీతి ఎండుటాకులా
ఎటు బడితే అటు కొట్టుకు పోతూ
తానేమైతుందో తెలియకుండ తాను గుట్టుగా ను పడిఉంటుంది
కోలుకొని లేచేలోగా అవినీతి తన
పని పూర్తి చేసుకుంటుంది.
2,).అలసి సొలసినవారు కోరేది
ఆప్యాయత మరియు ఆదరణ
దాహంవేసిన వారికి జలం కాక
భాగ్యాలు సౌభాగ్యాలవుతాయా?
3).ఫలితంపై అంచనాలు తారుమారైతే
ఆరు నూరైనా మన.స్సుపై
ప్రభావం పడకూడదు.
4)కామక్రోధ లోభములే మన
నిజమైన శత్రువులు మూడే కాని
అవి విస్తరించి మోహమదమాత్సర్యాలౌతాయి.
కామంతో మోహం-క్రోధంతో మదం
లోహంతో మాత్సర్యం పుట్టుకొస్తాయి. రవి పుత్రుడు శని
కూడా గ్రహమైనట్లు ఈ ఆరు కూడా
శత్రువులైనాయి.
5) మర్రి పండ్లు చిన్నగా ఎందుకుంటాయి?
జనం నీడకైవిశ్రమిస్తారు కనుక.
6)తీగకు గుమ్మడి కాయ అంత పెద్దది ఎందుకు?
దీని నీడకై ఎవ్వరు రారుగనక
7)ఏనుగుకు అంతా చిన్న కన్నులు
తోక ఎందుకు?
ఏనుగుకు పెద్ద కళ్ళైతే దాని మదం ముందు ఎవడు నిలుస్తాడు?