మన పండుగలు:-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్ నెంబర్.9491387977.నాగర్ కర్నూలు జిల్లా.
 పండుగలు-పండుగలు
తెలుగువారి పండుగలు
వెలుగు దారి పండుగలు
కొలువై వెలిగే పండుగలు!
              పండుగలు-పండుగలు
             సాంప్రదాయ పండుగలు
              సంక్రమించిన పండుగలు
             సత్సంక్రాంతి పండుగలు!
పండుగలు-పండుగలు
తెలుగునాట పండుగలు
తెలుగు వెలుగు పండుగలు
ఇల వెలుగు మన పండుగలు!
              పండుగలు -పండుగలు
              మన సై సై పండుగలు
              మనసైన ఈ పండుగలు
             మనం సైసు పండుగలు!
పండుగలు-పండుగలు
మన చరిత్ర పండుగలు
ఘన పవిత్ర పండుగలు
మన ధరిత్రి పండుగలు!
          పండుగలు-పండుగలు
          మన ప్రకృతి పండుగలు
          ఘన సంస్కృతి పండుగలు
          మన వనాకృతి పండుగలు!
పండుగలు-పండుగలు
మన కలి పండుగలు
మన ఆకలి పండుగలు
ఘన కలియుగం పండుగలు!
        పండుగలు-పండుగలు
       నేత్రపర్వమైన పండుగలు
       యాత్రసర్వమైన పండుగలు
        పండుగలు మన పండుగలు!